Header Banner

వేదికపైనే కుప్పకూలిన నటుడు విశాల్! ఆసుపత్రికి తరలింపు..!

  Mon May 12, 2025 10:53        Others

ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వేదికపైనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. కూవాగం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కూత్తాండవర్‌ ఆలయ చిత్తిరై (తమిళ మాసం) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల కోసం ‘మిస్‌ కూవాగం 2025’ అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందకు పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన నిర్వాహకులు, అభిమానులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. దీంతో కొద్దిసేపటికే విశాల్ తేరుకున్నారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం అక్కడే ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి పొన్ముడి, విశాల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అభిమానుల్లో ఆందోళన
ఇటీవల కాలంలో విశాల్ ఆరోగ్యంపై పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన నటించిన ‘మద గజ రాజా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో విశాల్ కాస్త నీరసంగా కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ ఊహాగానాలను అప్పట్లో విశాల్ బృందం ఖండించింది. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే నీరసంగా కనిపించారని స్పష్టం చేసింది. తాజా ఘటనతో విశాల్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ActorVishal #VishalHealthUpdate #CollapsedOnStage #BreakingNews #VishalFans